టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించడాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టుం2014లో తెలంగాణకు పలు కీలక హామీలు ఉన్నప్పటికీ, వాటి అమలులో కేంద్రం వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం స్థాపన, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి ముఖ్య అంశాలు ఆచరణలోకి రాలేదని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల అంశాల్లో హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఒక రాష్ట్రానికి చట్టబద్ధతతో ముందుకు తీసుకెళ్లే చర్యలు తీసుకుంటూ, మరో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించడం సమంజసంకాదని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షల కనుగుణంగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రం తక్షణమే అమలు చేయాలని మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు.
గద్దర్‌పై అమిత్‌షావి అనుచిత వ్యాఖ్యలు
ప్రజా యుద్దనౌక గద్దర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షావి అనుచిత వ్యాఖ్యలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బతుకు చిత్రాన్ని.. గజ్జె కట్టి, గళం విప్పి, పాట రూపంలో ప్రపంచానికి చాటి చెప్పి, రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడని తెలిపారు. కర్షక, కార్మిక లోకానికి అండగా.. కాషాయ కసాయి పార్టీకి వ్యతిరేకంగా.. జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. గతంలో రాహుల్ గాంధీ ఆయన్ను కలవడాన్ని ప్రజలంతా స్వాగతించారని గుర్తు చేశారు. తెలంగాణ సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన ”గద్దర్” పేరిట, ”తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు”లను ప్రారంభించడంతో పాటు, గద్దర్ కూతురు వెన్నెలని ”తెలంగాణ సాంస్కృతిక సారథి” కి ప్రభుత్వం చైర్ పర్సన్ గా నియమించిందని తెలిపారు.
హామీల అమలులో కేంద్రం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



