కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
మార్చ్ 30న ఛలో ఢిల్లీ ఓబీసీల జాతీయ సెమినార్
నవతెలంగాణ-అంబర్‌పేట
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, కేంద్రం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ జాతీయ సెమినార్ మార్చ్ 30, 31 తేదీల్లో ఢిల్లీలో జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు.కాచిగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ ఐక్య వేదక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. ఈ మేరకు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు.
ఈ సెమినార్ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లు, మేధావులు, 8 మంది కేంద్ర మంత్రులు, 20 మంది వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ 27 మంది మంత్రులను, నలుగురు గవర్నర్లను బీసీలను చేశారని గుర్తు చేశారు. అంతే కాకుండా గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడారు. మార్చ్ 30, 31న జరిగే జాతీయ సెమినార్‌కు ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య అభిలాషించారు. కార్యక్రమంలో బీసీ నేతలు రాజేష్ యాదవ్, అఖిల్, కిరణ్, రాజు యాదవ్, జల్లపల్లి అంజి, పగిడిమల్ల సతీష్, చందు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



