నవతెలంగాణ – ఉప్పునుంతల
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం పార్లమెంటులో చట్టం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. సీపీఐఎం ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, బీసీ కాలనీలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒంటరి పోరుతో ప్రయోజనం ఉండదని, అన్ని రాజకీయ, సామాజిక, కుల సంఘాలు కలసి ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు అడ్డుకుంటోందని విమర్శించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో చోటు కల్పించారనే సాకుతో కేంద్రం 42% రిజర్వేషన్‌ను అడ్డుకోవడం హేయమని పేర్కొన్నారు. బీసీలను అణగదొక్కడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని, బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయని తెలిపారు. అవసరమైతే బీజేపీ మంత్రులు, ఎంపీలను అడ్డుకునే స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కేసుమల్ల సైదులు, చిన్న రవి, బీసీ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధించాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES