– పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ – భిక్కనూర్
కేంద్రం మెడలు వంచి 42 శాతం బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో బీసీ సభ విజయవంతం చేయడానికి కార్యకర్తలు, ప్రజలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని గవర్నర్, రాష్ట్రపతి వద్ద బీసీ రిజర్వేషన్ ఫైల్ పెండింగ్ ఉందన్నారు. వినతులు, ధర్నాలు చేసిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 15వ తేదీ నాడు నిర్వహించే బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ విజయోత్సవ సభకు భారీగా తరలిరావాలన్నారు. సభ విజయవంతం చూసి బిజెపి ప్రభుత్వానికి కనువిప్పు చేయాలన్నారు.
కుల మత బేధం లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు పథకాల అమలు చూసి ఓర్వలేక పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూములు ఇల్లు కట్టించిన వర్షాలు వస్తే నీటిలో మునిగి పోతున్నాయన్నారు. ఏకకాలంలో రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళా శక్తి ద్వారా పథకాలు, ఉచిత బస్ ఇతర ఎన్నో సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
కామారెడ్డి లో నిర్వహించే సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేఖ సుదర్శన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజు, సొసైటీ చైర్మన్ భూమయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్రం మెడలు వంచి 42 % బీసీ రిజర్వేషన్ తీసుకురావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES