పన్నులు మనవి.. నిధులు ఉత్తరాదికి మళ్లింపు
పూలే విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రవీంద్రభారతిలో జ్యోతిరావుపూలే జయంతి
నవతెలంగాణ-కల్చరల్
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షతను ప్రశ్నించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా శనివారం నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో కలిసి డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన దగ్గర పన్నులు వసూలు చేస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాదిలో ఎంపీ స్థానాలను పెంచి దక్షిణాది ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ రాజకీయ కుట్రలను బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కుల గణన చేపట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా కాలయాపన చేస్తోందని తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పూలే విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయిం చిందని వివరించారు. ప్రపంచంతో పోటీపడే స్థాయిలో పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పౌష్టికాహారం అందించ డానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు జూన్ 2 నుంచి పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అమలు చేస్తామని తెలిపారు. కుల వృత్తుల భవనాలకు నిధులు కేటాయించామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గ మన్నారు. మహనీయుల చరిత్ర తెలుసుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసు కోవాలని సూచించారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లా డుతూ.. ప్రజల హక్కుల కోసం పోరాడిన సామా జిక విప్లవ యోధు డు పూలే అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు సొంత భవనా లు లేవని, వాటిని నిర్మిం చాలని కోరారు. మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జనాభా దామాషా ప్రకారం ప్రకారం రూ.20 వేల కోట్ల రూపాయలు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరగనున్న కులగణనలో బీసీల పేరు తీసివేయడం సరైంది కాదన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ.. ఈ నెల 16న ఢిల్లీలో ధర్నా చేపడుతు న్నట్టు తెలిపారు. ధర్నాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాలని కోరారు. ధర్నాకు దాదాపు 16 వేల మంది మహిళలు తరలిరావాలని పిలుపు నిచ్చారు. నగరంలోని నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం పక్కనే పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ వైస్ చైర్మెన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. పూలేకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలలో ఆయన జీవిత చరిత్ర చేర్చాలని కోరారు. అదే విధంగా బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రాందాస్ నాయక్, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్షతను ప్రశ్నించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



