- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని ఎంజీ కాలనీకి తండాకు చెందిన రాత్లావత్ రామచందర్ నాయక్ కుటుంబాన్ని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్ గురువారం పరామర్శించారు. రామచందర్ నాయక్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. చైర్మన్ వెంట పోతేపల్లి మాజీ ఎంపీటీసీ కాడు రామ్ నాయక్, అల్లంతోట బావి తండానాయకులు అరుణ్ నాయక్, నర్సింగ్ నాయక్, రఘు నాయక్, భీమ్ సింగ్ నాయక్తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -