- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని మోట్లగూడెం గ్రామానికి చెందిన కురుసం సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికీ 50 కేజీల బియ్యం అందించారు. సమ్మక్క కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అలుగువెల్లి కన్నయ్య,సమ్మయ, ఈక శేషు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -