నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల అడవి ప్రాంతంలో నివాసం ఉంటున్న చెంచులక్ష్మి ద్వారా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వివిధ చెంచు పెంటలకు చెందిన చెంచు కుటుంబాలు బుధవారం మన్ననూరు ఐటీడిఏ కార్యాలయంలో మేనేజర్ జాఫర్ కు వినతిపత్రం ఇచ్చారు. చెంచుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు జన్మన్ నిధుల ద్వారా మందూరు చేసిన ఇండ్లను ఐటిడిఏ ద్వారా నాణ్యతగా నిర్మించి ఇవ్వాలని చెంచులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పీఎం జన్మన్ ద్వారా నిర్మిస్తున్న ఇండ్లు నాణ్యతగా లేవన్నారు. నిర్మించిన ఇళ్లపై విచారణ చేయాలన్నారు. ఏ ఏ చెంచు పెంటలలో ఎన్ని ఇండ్లు నిర్మాణం చేశారు. ఒక్కొక్క ఇంటికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ చెంచు పెంటలకు చెందిన చెంచులు పెద్దిరాజు, గోపి, హనుమంతు, అంజయ్య లింగస్వామి,గోవిందు, తదితరులు ఉన్నారు.
చెంచులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెంచుల వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES