Sunday, September 21, 2025
E-PAPER
Homeసోపతిపిట్ట కొంచెం కూత ఘనం

పిట్ట కొంచెం కూత ఘనం

- Advertisement -

కథలు రాయడం, చెప్పడం ఒక సజనాత్మక కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ ఒక గ్రామీణ విద్యార్థి 11 సంవత్సరాల వయసులో 22 కథలు రాసి, ప్రముఖ సాహితీవేత్తల చేత ప్రశంసలు పొందడం మాత్రం అరుదైన విషయం. అతనే విశ్వతేజ. ఆ బుల్లి రచయిత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా అనంతసాగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న విశ్వతేజ సంవత్సంం వ్యవధిలో 22 కథలు రాశాడు. ఆ కథలన్నీ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో నాలుగు కథలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు కూడా అందుకున్నాడు. తల్లిదండ్రులు సంధ్య,లక్ష్మణ్‌. ఇతను రాసిన 18 కథలతో ‘విశ్వతేజం’ అనే బాలల కథా సంపుటిని ఉపాధ్యాయులు ముద్రించి, ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులచే పాఠశాలలో ఆవిష్కరించారు. బెట్టింగ్‌ గేమ్‌, రహదారులు భద్రత, పొలంలో రసాయనాల వాడకం, శాస్త్రీయ పరిజ్ఞానం లాంటి సమకాలీన సామాజిక స్థితిగతులనే కథా వస్తువులుగా చేసుకుని విశ్వ రాసిన కథలు చదివి బాల సాహితీవేత్తలు అబ్బుర పడ్డారు. జంతువుల కథలను విలక్షణమైన కథనంతో రాసి పలువురి మెప్పు పొందాడు. చదువులోనూ విశేష ప్రతిభా పాటవాలున్న ఇతని అభిరుచులు పుస్తక పఠనం, వార్తా పత్రికలు చదవడం. చెస్‌ ఆడడం. అతి చిన్న వయసులో సాహిత్యాభిరుచితో అద్భుతమైన కథలు రాసిన విశ్వతేజ నేటి బాలలకు ప్రేరణగా నిలుస్తాడని చెప్పడం అతిశయోక్తి కాదు.

బహుమతులు :
1.తెలంగాణ సారస్వత పరిషత్‌ హైదరాబాద్‌ వారి కథల పోటిలో నగదు బహుమతి.(2024 )
2.సుగుణ సాహితి సమితి సిద్దిపేట వారి ఉగాది కథల పోటీ 2025లో నగదు బహుమతి.
3.తెలుగు తల్లి కెనడా వారి కథ చెబుతారా ప్రపంచ స్థాయి అంతర్జాల సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం
4.పెందోట బాల సాహిత్య పీఠం వారి కవితల పోటీ- 2024లో ప్రత్యేక బహుమతి. కవితా సంకలనం లో స్థానం
5.పాఠశాలలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం 2025 లో పాల్గొనడం
6.ఖమ్మం వురిమళ్ల్ల ఫౌండేషన్‌ వారి జాతీయ స్థాయి కథల పోటీ 2025 లో ప్రత్యేక బహుమతి
హిందీ ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ప్రోత్సాహంతో…

దుర్గమ్‌ భైతి, 9959007914

    - Advertisement -
    RELATED ARTICLES
    - Advertisment -

    తాజా వార్తలు

    - Advertisment -