నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతినీ, సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మరణం ప్రజా జీవితానికి తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. అజిత్ పవార్ కుటుంబానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ప్రజలకు సానుభూతి తెలిపారు. విషాద సమయంలో అజిత్ పవార్ కుటుంబం ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం
అజిత్ పవార్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాలలో తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
అజిత్ పవార్ మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



