గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను గాడిన పెట్టాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురవడం తనను కలచివేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో నిత్యం కలుషిత ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, పాము కాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగడం లేదని విమర్శించారు. గురుకుల విద్యా సంస్థల్లో అపరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, అరకొర వసతులతో విషజ్వరాలు ప్రబలుతున్నాయయనీ,. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల ఆవరణలో సంచరిస్తున్న పాములు విద్యార్థులను కాటు వేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా మేల్కొనాలని కోరారు. పాము కాటుకు గురైన అస్మితకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ కవిత డిమాండ్ చేశారు.
సీఎం మొద్దునిద్ర వీడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



