- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాదర్‌ను సమర్పించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రులు అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన చాదర్‌ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ గురుకులాల సొసైటీ వైస్ చైర్మెన్ ఫహీంఖురేషీ, హజ్ కమిటీ చైర్మెన్ అఫ్జల్ బియాబని, వక్ఫ్‌బోర్డు చైర్మెన్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్, ముస్లీం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



