Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలి ..

సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలి ..

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి 
నవతెలంగాణ – పరకాల 
: రాజీవ్ వికాస పథకంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న సిబిల్ స్కోర్ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో అత్యధికులు స్మాల్ స్కేల్ ఫైనాన్స్ వ్యవస్థపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రజలు సకాలంలో ఫైనాన్సులు చెల్లించలేక సిబిల్ స్కోర్ తగ్గిపోతుందన్నారు. అత్యంత నిరుపేదో కుటుంబాలకు చెందిన ప్రజలు మాత్రమే సిబిల్ స్కోర్ రీచ్ కాలేకపోతున్నారని, అలాంటి పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సైతం సిబిల్ స్కోర్ నిబంధన పెట్టడం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించే ఏ సంక్షేమ పథకం కైనా సిబిల్ స్కోర్ నిబంధనను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తిరుపతి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -