Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తరగతి గది పుస్తక పఠనంతో ప్రకాశించాలి..

తరగతి గది పుస్తక పఠనంతో ప్రకాశించాలి..

- Advertisement -

తెలంగాణ విద్యా వికాస వేదిక… కన్వీనర్ కస్తూరి ప్రభాకర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

తెలంగాణలో విద్యారంగం స్థితిగతుల్ని మార్చడానికి , వివిధ నివేదికలు ఎత్తిచూపుతున్న కనీస ప్రమాణాలను సాధనకు టీచర్లు తరగతి గదిలో విద్యార్థుల్లో భాష అభిరుచిని సాహిత్య సంస్కృతిక మానవీయ విలువలను పెంపొందించ డానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని అందుకోసం నిరంతరం ప్రయత్నించాలని తెలంగాణ విద్య వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ అన్నారు. బుధవారం మండలంలోని అనాజీపురం  కాంప్లెక్స్ పాఠశాల,  వివిధ కాంప్లెక్స్ సమావేశాల్లో ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ సి ఆర్ టి రూపొందించిన కథల పుస్తకాలతో పాటు పాఠశాలల్లో ఇదివరకే ఉన్న పుస్తకాలు అన్నిటిని రీడింగ్ కార్నర్ గా లేదా గ్రంథా లయంగా ఏర్పాటు చేసి పుస్తక పఠనం పట్ల అభిరుచిని పెంపొందించాలని తెలిపారు.

పాత మూస పద్ధతిలో పుస్తకాల్లో ఉన్నది చదివి రాయించడం మాత్రమే కాకుండా విద్యార్థులలో క్రియాశీల త్వాన్ని నైపుణ్యతను పెంచడానికి ప్రశ్నించే తత్వాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని అన్నారు.  చదవడం, రాయడం, స్పందించడం, ప్రశ్నించడం లాంటి ప్రక్రియల్ని నిరంతరం తరగతి గదిలో కొనసాగించాలని, .సమాజంలో లుప్తమవు తున్న మానవ విలువలను పెంపొందించడానికి మహనీయుల త్యాగాలను, సమాజం పట్ల కర్తవ్యాలను చదివించడం ద్వారా విద్యా నైపుణ్యాలను పెంపొందించ వచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నాగవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తరగతిగది ఎదుర్కొం టున్న అనేక  సమస్యలను పదేపదే ప్రస్తావించడం కంటే తమదైన వ్యక్తిగత నైపుణ్యాలతో తరగతి గది బోధనను ఆకర్షణీయంగా మార్చాలని సూచించారు.

కనీసం చదవడం రాయడం ప్రతిస్పందించడం చేయలేక పోవడం తరగతి గది ఎదు ర్కొంటున్న సంక్షోభమని దీనిని నివారించడానికి ప్రతి టీచర్ రీడింగ్ కార్నర్ ని ఉపయోగించుకొని పుస్తక పఠనం నిరంతర ప్రక్రియగా కొనసాగించడం ద్వారా విద్యార్థుల్లో నూతన దృక్ప థాన్ని విద్యా ప్రమాణాలను పెంప పెంపొందించ వచ్చున్నారు. పలురూ ఉపాధ్యాయులు చర్చలో పాల్గొంటూ అసలు పిల్లల్ని మందలించలేని దయనీయ స్థితిలో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయని నిరంతరం ఏవో నింపుడు పంపే కార్యక్రమాలు తప్ప మమ్మల్ని పాఠం చెప్పని పరిస్థితి తరగతి గదిలో లేనందున తర్వాత టీచరు క్లాసు లేకపోవడం ప్రాథమిక విద్యారంగానికి ఒక అవరోధంగా ఉందని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రవి కుమార్,  ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజీ,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad