– డ్రైనేజీల శుభ్రం చేయడం మరచిన మున్సిపాలిటీ
– మూల మలపులలో చెత్త వేసే వారిపై చర్యలు ఏవి ?
– కామారెడ్డి నీ పరిశుభ్రత పట్టణంగా మార్చడంలో విఫలవుతున్న మున్సిపల్ అధికారులు
నవతెలంగాణ – కామారెడ్డి
గత ప్రభుత్వం పట్టణం, పల్లె అని చూడకుండా ప్రతిచోట పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో బాగానే జరిగిన రాను రాను అధికారుల నిర్లక్ష్యంతో ఆ విధానం పడకేసింది. కామారెడ్డి మున్సిపల్ లో 49 వార్డులు కాగా అందులో జనాభా సుమారు లక్ష, 40,000 వరకు ఉంటుంది. 49 వార్డులు ఇందులో మొత్తంగా పారిశుద్ధ కార్మికులు 259 కాగా వీరంతా ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. ఇందులో 45 మంది డ్రైవర్లు, 201 పారిశుద్ధ కార్మికులు, 13 మంది జవాన్లు ఉన్నారు. రెగ్యులర్ మున్సిపల్ కార్మికులు 29 మంది ఉండగా అందులో రెవెన్యూ శాఖ నుండి వచ్చిన 8 మంది జవాన్లుగా కొనసాగుతున్నారు. మొత్తంగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 287 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. కమారెడ్డి పట్టణంలో డ్రైనేజీలో నీరు నిల్వ ఉండడంతో మురికి అనేది ఒక ముఖ్యమైన సమస్యగా ఏర్పడింది. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ కాలనీలో సమస్య ఉంది అనీ మున్సిపల్ అధికారులుకు ఎన్నిసార్లు చెప్పినా వినట్టే ఊరుకుంటున్నారని, వారి నుండి మాత్రం సరైన విధంగా స్పందించడం లేదనీ పట్టణవాసులు పేర్కొంటున్నారు. చెత్తను సేకరించే వాహనాలు సైతం కొన్నిచోట్లకు వెళ్లడం లేదు. మా పని మేము చేస్తున్నం అన్నట్లుగా మున్సిపల్ కార్మికుల తీరు ఉంది అని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త తీసుకెళ్తున్నామా అన్న విధంగా వ్యవహరించడంతో కామారెడ్డి పట్టణంలో ఏ గల్లీలో చూసిన ఆరు బయట చెత్త వేయడం ఆ చెత్త డ్రైనేజీల్లో పడి నీరు వెళ్లకుండా అడ్డుపడడంతో డ్రైనేజీలో నీరు నిలువ అవుతుంది.
అయినప్పటికీ మునిసిపల్ అధికారులు మాత్రం డ్రైనేజీలు శుభ్రం చేయడంలో, గల్లీలోని మూల మలపులలో వద్ద వేసి చెత్త వేయకుండా గత మున్సిపల్ చైర్మన్గా గడ్డం ఇందు ప్రియా ఉన్న సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇక్కడ చెత్త వేస్తే ఫైన్ వేయడంతో పాటు మీ ఫోటోలను ఫ్లెక్సీలో ప్రకటిస్తామని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కొద్దిగా తగ్గినప్పటికీ తిరిగి యధావిధిగా కాలనీలోని మూలమలకుల వద్ద చెత్తను వేస్తూనే ఉన్నారు. ఆ ఫ్లెక్సీలు వేసి ఆ తర్వాత పర్యవేక్షించకపోవడంతో ప్రజలు యధావిధిగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్రక్ష్యంతో పట్టణంలో డెంగీ, మలేరియా తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది. మున్సిపల్ కార్మికులు సరైన పర్యవేక్షణ చేయక పోవడంతో ఎప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియడం లేదు. పట్టణంలో వివిధ చోట్ల చెత్త పేరుకు పోతుంది. ఆ పేరుకుపోయిన చెత్త డ్రైనేజీలో పడడంతో నీరు వెళ్ళక అక్కడే జమాయి, దోమలు వృద్ధి చెందడమే కాకుండా దుర్వాసన రావడంతో మున్సిపల్ పరిధిలోని వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.
కామారెడ్డి మునిసిపల్ పరిధిలో డ్రైనేజీ మురికి వల్ల కలిగే సమస్యలు..
ఆరోగ్య సమస్యలు: మురికి నీరు నిలబడి ఉండటం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెంది, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దుర్వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి.
పర్యావరణ కాలుష్యం: మురికి నీరు పైనే కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. ఇది సమీపంలోని ఇండ్లలో ఉండే బోరు బావులలోకి ఇంకి బోర్లలో నీటిని సైతం కలుషిత నీటిగా మార్చే అవకాశం లేకపోలేదు.
దుర్వాసన: డ్రైనేజీ మురికి వల్ల వచ్చే దుర్వాసన ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా ఇళ్ల పక్కన నివసించే వారికి మినప్పటి మునిసిపల్ అధికారుల్లో మాత్రం చల్లగా లేదు. పక్కన నివసించేవారు కిటికీలు, డోర్లను పూర్తిగా మూసివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రవాణా సమస్యలు: కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీలో ప్లాస్టిక్ చెత్త పేరుకుపోవడంతో నీరు వెళ్లాక డ్రైనేజీల్లో నుండి రోడ్లపైకి నీరు వచ్చి, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందనీ తెలిసిన అధికారులు మాత్రం అక్కడ నీరు నిలవకుండా డ్రైనేజీలు పొంగకుండా అరికట్టడంలో విఫలమవుతున్నారనీ పట్టణ ప్రజల విమర్శిస్తున్నారు.
సరైన ప్రణాళిక లేకపోవడం: చాలా ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా నిర్మించకపోవడం లేదా పాతబడిపోవడం, డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్ల చెత్తాచెదారం పేరుకుపోయి నీరు నిలిచిపోతుంది. ముఖ్యంగా కమారెడ్డిలోని విద్యానగర్ ప్రాంతంలో డ్రైనేజీ మురికి అనేది ఒక తీవ్రమైన సమస్య, దీని వల్ల నివాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
విద్యానగర్‌లో డ్రైనేజీ మురికి సమస్య
విద్యానగర్ అనేది కమారెడ్డిలో నివాస ప్రాంతం, ఇక్కడ డ్రైనేజీ సమస్యలు తరచుగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణాలు క్రింద వివరించబడ్డాయి.
పాత డ్రైనేజీ వ్యవస్థ: విద్యానగర్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ చాలా పాతది, ప్రస్తుత జనాభా అవసరాలకు సరిపోవడం లేదు. ఇది సరిగా నిర్మించబడకపోవడం లేదా కాలక్రమేణా దెబ్బతినడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
నిర్వహణ లోపం: డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్ల చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నీరు నిలిచిపోతుంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది, డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి నీరు వస్తుంది. స్థానికులు చెత్తను, ముఖ్యంగా ప్లాస్టిక్‌ను డ్రైనేజీలలో వేయడం వల్ల అవి అడ్డుపడి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.
పరిష్కార మార్గాలు
విద్యానగర్‌లో ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని మార్గాలు
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం: పాతబడిన డ్రైనేజీలను పునరుద్ధరించాలి లేదా కొత్త, ఆధునిక వ్యవస్థను నిర్మించాలి. ఇది వర్షాకాలంలో నీరు నిలబడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. నియంత్రిత శుభ్రపరచడం: మున్సిపల్ అధికారులు డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. పేరుకుపోయిన చెత్తను, బురదను ఎప్పటికప్పుడు తొలగించాలి.
ప్రజలలో అవగాహన: వ్యర్థాలను డ్రైనేజీలలో వేయకుండా, తగిన చెత్తబుట్టలలో వేయాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కూడా ముఖ్యమే.
బిల్డింగ్ యజమానులకు ప్రత్యేక జరిమానా విధించాలి..
కామారెడ్డి లో ప్రధాన సమస్య బిల్డింగ్లలో అద్దెకు ఉంటున్న వారు చెత్త సేకరించడానికి ఆటో వచ్చిన ఆటలో వేయకుండా ఆటో వెళ్లిన 10 నిమిషాలకే వచ్చి మూలమలుపుల వద్ద చెత్తను వేస్తూ ఉన్నారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలిసిన వారిని ఏమీ అనలేకపోతున్నారు. ఒక్కరోజు రెండు రోజులు మున్సిపల్ నుండి ఒక వ్యక్తిని అక్కడ ఉంచి ఎవరు వేస్తున్నారు వాళ్ళ ఫోటోలు ఏ బిల్డింగ్ నుంచి వస్తున్నారు ఆ బిల్డింగ్ ఫోటో తీసుకొని ఆ బిల్డింగ్ యజమానికి జరిమానా విధిస్తే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మాకెందుకులే అనుకుంటే ముందు ముందు ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ జోక్యం: స్థానిక ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం గురించి కూడా ఆలోచించాలి.
చెత్త వేసే వారిని గుర్తించి జరిమానా విధించాలి. ( మాలోత్ గంగారం , విద్యానగర్ )
మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు చెప్పాం గతంలో ఎక్కడ శుభ్రం చేసి ముగ్గులు వేసిన చెత్త వేసే వరు మాత్రం వేస్తూనే ఉన్నారు. దీంతో మా ఇంటి పక్కన ఉన్న డ్రైనేజీలో ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాలు పడి మీరు వెళ్లక దుర్వాసన వస్తుంది మేము మా ఇంటి కిటికీలు ధోళ్లను మూసి వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అధికారుల స్పందించి ఎవరైతే చెత్త వేస్తారో వారిని గుర్తించి జరినాలను విధిస్తే బాగుంటుంది.