Monday, February 9, 2026
E-PAPER
Homeసినిమారాజమండ్రిలో క్లైమాక్స్‌

రాజమండ్రిలో క్లైమాక్స్‌

- Advertisement -

హీరో దుల్కర్‌ సల్మాన్‌ తాజాగా ‘ఆకాశంలో ఒక తార’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్‌ సాదినేని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమా సమర్పణలో ఈ చిత్రాన్ని సందీప్‌ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్‌ సరసన కొత్త హీరోయిన్‌ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ నేటి నుంచి (సోమవారం) రాజమండ్రిలో ప్రారంభం కానుంది. హీరో, హీరోయిన్‌ పై క్లైమాక్స్‌ షూట్‌ చేయబోతున్నారు.

డైరెక్టర్‌ పవన్‌ సాదినేని ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. బలమైన కథ, పర్ఫార్మెన్స్‌లు ఉన్న క్రేజీ ప్రాజెక్టు ఇది. శృతిహాసన్‌ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉండబోతుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం, సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ, శ్వేతా సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్‌-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -