Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంది నేర ప్రవృత్తి

సీఎంది నేర ప్రవృత్తి

- Advertisement -

– అసెంబ్లీలో అబద్ధాల వరద పారించారు
– బెదిరిస్తూ, బూతులు మాట్లాడారు
– కేసీఆర్‌ను ప్రశ్నించడం అంటే…సూర్యుడిపై ఉమ్మేయడమే : బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనాయకులు టీ హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత టీ హరీశ్‌రావు అన్నారు. బెదిరిస్తూ, బూతులు మాట్లాడుతూ ఆయన తన నేర ప్రవృత్తిని బట్టబయలు చేసుకున్నారని విమర్శించారు. మాజీ సీఎం కే చంద్రశేఖరరావును ప్రశ్నించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని సీఎం గ్రహించాలని హితవు పలికారు. ‘నీళ్లు-నిజాలు’ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రసంగం మొత్తం అబద్ధాలేనని కొట్టిపారేశారు. ఆయన వికృతభాషకు సభ్యసమాజం తలదించుకుంటున్నదనీ, స్పీకర్‌ ఆయన్ని వారించకపోవడం విచారకరమని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కోసం 2009 సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కార్యాలయం నోట్‌ ఇస్తే, 2014 ఎన్నికల సమయంలో డీపీఆర్‌ కోసం జీవో జారీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌పార్టీది అని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏనాడు భాగం పంచుకోలేదని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అన్ని విషయాల్ని ఆధారాలతో వివరిస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -