– ముగ్గురు విద్యార్థులకు గాయాలు
– పాఠశాలను పరిశీలించిన అధికారులు, నాయకులు
నవతెలంగాణ- మహమ్మదాబాద్
పాఠశాల భవనం పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం మండల పరిధిలోని నంచర్ల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నంచర్ల ప్రాథమిక పాఠశాల 2వ తరగతి గదిలో స్లాబ్ పెచ్చులు ఊడి ముగ్గురు విద్యార్థుల తలలపై పడ్డాయి. వారికి స్వల్ప గాయాలు కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించాలరు. వెంటనే జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పాఠశాలకు వచ్చి విద్యార్థులను పరామర్శించారు. పాత భవనంలోపి మూడు గదుల్లో విద్యార్థు లను కూర్చోబెట్టొద్దని, లైబ్రరీ గదిని వాడుకోవాలని ప్రధానో పాధ్యా యురాలు రేణుకా దేవికి సూచించారు. పక్కనే ఉన్న హైస్కూల్ రెండు గదులను ప్రైమరీ స్కూల్‌కు ఇవ్వాలని హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేందర్‌రెడ్డికి సూచించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ గాయత్రిదేవి పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరామర్శించి భవనాన్ని పరిశీలిం చారు. జిల్లా విద్యాధికారి వెంట ఏఎంఓ దుంకుడు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
పెచ్చులూడిన పాఠశాల భవనం స్లాబ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



