నవతెలంగాణ – బజార్ హాత్నూర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిప్రి గ్రామంలో సభ స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఈనెల 6 తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు లు హాజరవుతున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ లు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా డా నరేష్ జాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకి రావడం ఇది నాలుగవ సారని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు అనడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఈ నెల 6 వ తేదీ న సభ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏలేటి అశ్విన్ రెడ్డి, పిప్రి గ్రామ సర్పంచ్ కృష్ణకాంత్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మా రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్,ఇచ్చోడా మార్కెట్ చైర్మన్ కొమురం కోటేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు లోలపుపోశెట్టి, బద్దం పురుషోత్తం రెడ్డి, ఇచ్చోడా మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు జల్కె పాండురంగ్, బోథ్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోత రెడ్డి, బోత్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



