- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య బిల్డింగ్ నిర్మాణ పనులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పరిశీలించారు. మంగళవారం రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా మహిళా సమైక్య బిల్డింగ్ నిర్మాణపు పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో పనులను వేగవంతం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. అక్టోబర్ నెల వరకు బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.
- Advertisement -