Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీబీపేట పెద్ద చెరువును గురువారం రాత్రి పరిశీలించిన కలెక్టర్ 

బీబీపేట పెద్ద చెరువును గురువారం రాత్రి పరిశీలించిన కలెక్టర్ 

- Advertisement -

– లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి 
– అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి: కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ 
నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్ 

బుంగ పడ్డ బిబిపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువును గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం రాత్రి  పరిశీలించారు. ఎస్డిఆర్ఎఫ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు  ఈ బుంగ మూత పనులలో పాలు పంచుకుంటున్నారు. బుంగమూత పనులను త్వరగా పూర్తచెయ్యాలని, చెరువులో లోతట్టు ప్రాంతాలలోని గ్రామాల ప్రజలకు ఎలాంటి  ప్రమాదం జరగకుండా ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి తీసుకుంటున్న  రక్షణ చర్యలను పకడ్బందీగా పర్యవేక్షించాలని  అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు చెప్పిన విధంగా తగిన చర్యలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయనతోపాటు కామారెడ్డి ఆర్ డి ఓ వీణ, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పనికి ప్రేమ్ కుమార్, బీబీపట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్ , స్థానిక రాజకీయ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -