నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు లతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించారు. బాబా సాహెబ్ అంబేద్కర్, జాతిపిత గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందాలని, అదే సందర్భంలో అర్హులైన నిరుపేదలకు చేరేలా చూడాలని కోరారు.
బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పైళ్ల శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాసిల్దార్ కార్యాలయంలో ఎన్ అంజిరెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో శ్రీనివాస్, రూరల్ పోలీస్ స్టేషన్లో అనిల్ కుమార్, ఎంఈఓ కార్యాలయంలో నాగవర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాలలో గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక కోన్నత పాఠశాలలు, జాతీయ జెండాలను ఆవిష్కరించి, వివిధ ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి ,మజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు ఎడ్ల సత్తి రెడ్డి, కంచి మల్లయ్య, కడారి వినోద్, బల్గురి మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి హలో అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు
దయ్యాల నరసింహ, సిపిఎం నాయకులు ఎదునూరి మల్లేష్, గునుగుంట్ల శ్రీనివాస్, సిల్వర్ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నం శ్రీనివాస్, నాయకులు పకీర్ కొండల్రెడ్డి, జీలుగు సతీష్ పవన్,నానం కృష్ణ గౌడ్, తంగేలపల్లి శ్రీనివాసచారి, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, మోడెపు శ్రీనివాస్ గౌడ్, పిట్టల వెంకటేష్, మట్ట శంకర్ బాబు, రాంపల్లి కృష్ణ, స్వచ్ఛంద సంస్థ నాయకులు పాల్గొన్నారు.