Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవాణిజ్య పన్నుల శాఖను ఖాళీ చేయించాలి

వాణిజ్య పన్నుల శాఖను ఖాళీ చేయించాలి

- Advertisement -

ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలి : పొన్నం ప్రభాకర్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఆర్టీసీ బస్‌భవన్‌లోని మొదటి అంతస్థునుంచి వాణిజ్య పన్నుల శాఖను వెంటనే ఖాళీ చేయించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. తద్వారా ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం మంత్రికి వినతిపత్రాన్ని ఈమెయిల్‌ పంపించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి విఎస్‌రావు ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ మధ్య ఆస్తులతోపాటు ఇతర వివాదాలను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వానికి ఏకపక్ష హక్కు లేదని స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి ఈ సమస్యలపై చొరవ చేసి పరిష్కరించాలని చెప్పారు. బస్‌భవన్‌లో ఏ బ్లాక్‌ను తాళాలు పగులగొట్టి ఆక్రమిం చుకోవడాన్ని ఖండించారు. ఇది అభ్యంతరకరమైన విషయ మని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ బస్సుల రాకతో రాష్ట్రవ్యా ప్తంగా అనేక డిపోల్లో ఆర్టీసీ బస్సులను ఖాళీ చేయిం చడాన్ని తప్పుబట్టారు. ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -