Sunday, September 21, 2025
E-PAPER
Homeఖమ్మంసభ్యులకు సంఘం అండదండగా ఉంటుంది

సభ్యులకు సంఘం అండదండగా ఉంటుంది

- Advertisement -

– ఉపాధ్యాయుడి కుటుంబానికి రూ.6 లక్షల చెక్ అందజేత
– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

సభ్యులకు సంఘం అన్ని వేళలా అండదండగా ఉంటుందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు సంఘం సభ్యులకు భరోసా ఇచ్చారు. గత నెల 20 తేదీన అనారోగ్యంతో మృతిచెందిన టీఎస్ యూటీఎఫ్ సభ్యుడు, రెడ్డిగూడెం ఉపాధ్యాయుడు దారబోయిన ప్రసాద్ కుటుంబానికి టీఎస్ యూటీఎఫ్ ఫేమిలీ వెల్ఫేర్ ఫండ్ విభాగంలో సభ్యుడికి చెల్లించే రూ.6 లక్షల చెక్ పంపిణీ కార్యక్రమం సంఘం మండల అధ్యక్షులు కాపుల హరినాథ్ అద్యక్షతన స్థానికి బాలికోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజు మాట్లాడుతూ.. అకాల మరణం చెందిన టీఎస్ యూటీఎఫ్ ఎఫ్ డబ్ల్యు ఎఫ్ సభ్యులందరికీ యూనియన్ నుంచి ఆర్థిక భరోసా తో పాటు వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇతర ప్రయోజనాలను ఇప్పించడం లో సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,ఎఫ్ డబ్ల్యు ఎఫ్ రాష్ట్ర సభ్యులు ఎన్.కృష్ణ, జిల్లా కన్వీనర్ దాసు,తావుర్యా,బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండలరావు,జెడ్పీ హెచ్ ఎస్ నారాయణపురం ప్రధానోపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి రావెళ్ళ రమేష్,ఎం. క్రిష్ణా రావు,రాజేశ్వరరావు,మండల బాద్యులు ఎం.వెంకటేశ్వర్లు,టి.వెంకటేశ్వరావు,కట్టా మధు,సరియం జ్యోతి,యూనియన్ సభ్యులు హాజరు అయినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -