- Advertisement -
- – సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావుకు ఇచ్చిన వెసులుబాటును రద్దు చేయాలని కోరుతూ ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రభాకర్‌రావును ఈ కేసులో అరెస్ట్ చేయరాదంటూ సుప్రీంకోర్టు ప్రభాకర్‌రావు వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరై పూర్తిగా సహకరించాలని ఆ సమయంలో కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా ప్రభాకర్‌రావును విచారించినప్పటికీ.. ఆయన ఏ మాత్రమూ సహకరించటంలేదనీ, అవసరమైన సమాచారాన్ని ఇవ్వటంలేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకిచ్చిన వెసులుబాటును రద్దు చేయాలనీ, తద్వారా ఈ కేసులో తాము ప్రభాకర్‌రావును విచారించి ముందడుగు వేయగలమని సిట్ అధికారులు భావిస్తున్నారు.
- Advertisement -