ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ..
నవతెలంగాణ- రాయపోల్
వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచకుండా వారి డబ్బులు దోచుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పెన్షన్లు పెంచాలని ఎంఎస్ పి రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ అన్నారు. గురువారం రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో పెన్షన్ దారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు మరియు వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 5న దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో చేయూత పెన్షన్ దారుల మహాసభను నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రపదేశ్ లో ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచి ఇస్తున్నాడు.కానీ తెలంగాణలో రూ.6 వేలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశాడన్నారు.2023 ఎన్నికలలో ఈ నెల ఓటు వేయండి, వచ్చే నెల పెరిగే పెన్షన్ తీసుకొండని మాట్లాడిన రేవంత్ రెడ్డి సిఎం పదవి చేపట్టి 21 నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు.కాబట్టే 50 లక్షల మంది పెన్షన్ దారుల పక్షాన మంద కృష్ణ మాదిగ పోరాటానికి శ్రీకారం చుట్టారన్నారు.దుబ్బాక నియోజక వర్గ పరిధిలో ఉన్న అన్ని రకాల పెన్షన్ దారులు మహాసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి మాదిగ, నాయకులు సోమని ఇస్తరి మాదిగ, చేయూత పెన్షన్ దారులు, వికలాంగులు తదితరులు ఫ్పాల్గొన్నారు.
వికలాంగుల, పెన్షన్ దారుల మహాసభను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES