కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృతంగా ఇంటింటి ప్రచారం
ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి
నవతెలంగాణ-పాలకుర్తి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండా నేనని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండాలలో స్థానిక నాయకులతో కలిసి కృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి సాధ్యమన్నారు.
నవీన్ యాదవ్ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందుబాటులో ఉంటాడని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు జనాకర్షణగా ఉన్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజల కోసం పనిచేసే నాయకులను ఆదరించాలని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


