– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
స్థానిక ఎన్నికల్లో పల్లె పల్లెలో కాంగ్రెస్ జెండా విజయపతాకం ఎగరాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండల ఎంపిటిసి, గ్రామ కోఆర్డినేటర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ జెండా ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగాని ఇస్తుందనే విషయాన్ని ప్రజానీకానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రజా పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకం లబ్ధిదారులకు చేకోరుతుందని.. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నైజాం అని కొనియాడారు. ప్రతిపక్షాలకు తావు ఇవ్వకుండా ప్రజలకు ప్రజాపాలనపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉందన్నారు. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో రాయపర్తి మండలం దశరవారీగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ప్రతి ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు కంకణబద్ధులై ఉన్నారని వివరించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో తొర్రూరు బ్లాక్ అద్యక్షులు జాటోత్ హామ్యా నాయక్, మండల కోఆర్డినేటర్స్ పెద్దగాని సోమయ్య, జినుగు సురేందర్ రెడ్డి, ఎల్లంద ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, రెంటాల గోవర్ధన్ రెడ్డి, మచ్చ నీలయ్య, పెండ్లి మహేందర్ రెడ్డి, ఉల్లెంగుల యాదగిరి, ఎల్లయ్య, సుదర్శన్ రెడ్డి, ఎండి నాయిమ్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె పల్లెలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES