Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలను నవ్వులపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం  

బీసీలను నవ్వులపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం  

- Advertisement -

చండూరు మాజీ జడ్పిటిసి శ్రీ కర్నాటి వెంకటేశం  
నవతెలంగాణ – చండూరు 

స్థానిక సంస్థలలో 42% బి.సి.లకు రిజర్వేషన్లని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బిసి లను కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వులపాలు చేసిందని చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం  విమర్శించారు. గురువారం ఆయన గట్టుప్పల   మండల కేంద్రంలో  విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ  జీ.వో. నెం. 9 మీద హైకోర్ట్ స్టే విధించిందంటే  ఈ జి.ఓ తప్పుల తడకగా ఉందని అర్థమైంది అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, రాహుల్ గాంధీ మెప్పు కొరకు మాత్రమే ప్రయత్నం చేసినట్లు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బి.సి లకు. రిజర్వేషన్ల కొరకు ప్రయత్నం చేసినట్లు ప్రజల ముందు మమ అనిపించుకోవడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బి.సి.లకు 42% ఇవ్వాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూలులో పొందుపరచి, రాష్ట్ర బి.సి.లకు న్యాయం చేయాలని, చట్ట బద్ధత కల్పించినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మనుగడ  ఉంటుందన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటులో ఆ దిశగా ప్రయత్నం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు  చిలుకూరి అంజయ్య, పున్న కిషోర్, కర్నాటి వెంకటేశం, నారని జగన్, నెలంటి వెంకటేశం,చెరుపల్లి నగేష్, దోర్నాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -