Saturday, July 26, 2025
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించింది: మందకృష్ణ మాదిగ

కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించింది: మందకృష్ణ మాదిగ

- Advertisement -

ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకివ్వరు ?
పెన్షన్ సాధించుకోవాలంటే మరో  పోరాటం తప్పదు
ఆగస్టు 13న జరిగే మహా గర్జన సభను విజయవంతం చేయాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – భూపాలపల్లి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ విస్మరించిందని హామీని అమలు చేయ కుండా వారిని మోసం చేస్తోందని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచాలని, పెన్షన్ సాధించుకోవాలంటే మరో  పోరాటం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఆగస్ట్ 13న హైదరాబాద్ లో జరిగే దివ్యాంగుల, ఆసరా పెన్షన్ దారుల  మహాగర్జన సభకోసం  శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన  జిల్లా సన్నాహక సమావేశానికి మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి అధ్యక్షత వహించగా… మంద కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు పెంచలేకపోయారని విమర్శించారు.

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే వికలాంగుల, వృద్ధాప్య అన్ని రకాల పింఛన్లు పెరిగాయని గుర్తు చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 200 పింఛను రెండు వేలకు పెంచిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని గుర్తు చేశారు. అప్పుడు నత్తనడక నుండి ఇప్పుడు హై స్పీడ్ లాగా పెన్షన్ పెరుగుతూ వస్తుందంటే ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే అని గుర్తు చేశారు.  దివ్యాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్ దారులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు అందించాలన్నారు. పెన్షన్ దారుల కు ఇవ్వాల్సిన రూ.20 వేల కోట్లు ఎవరికి దోచిపెట్టారని ఆయన నిలదీశారు. పెన్షన్ పెంచామని అడగకుండా ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని, పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇక రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామని, పెన్షన్ దారులకు అందించాల్సిన మొత్తాన్ని పెంచేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.

ఎమ్మార్పీఎస్ పోరాటం ద్వారానే రాజీవ్ ఆరో గ్యశ్రీ పథకం వచ్చిందని దీంతో ఇప్పుడు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని గుర్తుచేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచి ఇస్తుంటే.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పింఛన్లు పెంచడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని హెచ్చరించారు. పింఛన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దుమ్ము వెంకటేశ్వర్లు, ఎం ఎస్ పి సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్ర ఎమ్మార్పీఎస్, ఎం ఎస్పి, విహెచ్పి ఎస్ నాయకులు  నోముల శ్రీనివాస్, దోర్ణాల రాజేందర్, గాజుల బిక్షపతి,బొల్లి బాబు, అంతదుపుల సురేష్, మంద తిరుపతి, లతో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -