లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేత..
నవతెలంగాణ – మల్హర్ రావు
పేదలకు కనీస అవసరాలైన తినడానికి కూడు, ఉండడానికి గూడు ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. ఆదివారం తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో రైతువేదికలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేశారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ళలో తినడానికి సన్నబియ్యం, నివాసం ఉండడానికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన్నారు. అనంతరం ట్రేడ్ చైర్మన్, ఈజిఎస్ సభ్యుడు, గ్రంథాలయ చైర్మన్ వలను సర్పంచ్, ఉప సర్పంచ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాoతి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, సారయ్య, అశోక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



