Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీని అట్టడుగు భాగం నుండి పునరుద్ధరించాలి 

కాంగ్రెస్ పార్టీని అట్టడుగు భాగం నుండి పునరుద్ధరించాలి 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని అట్టడుగు భాగం నుండి పునరుద్ధరించాలని నిర్ణయించిందనీ ఏఐసిసి అబ్జర్వర్  రాజ్ పాల్ కరోల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం కామారెడ్డి  నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం  కామారెడ్డి పట్టణ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్  షబ్బీర్ అలీ,  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు , నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘా అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని స్వీకరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -