Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

- Advertisement -
  • – పరకాల, నడికూడ మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ
    – ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 
  • నవతెలంగాణ -పరకాల 
  • బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని వేల్లంపల్లి రోడ్ యందు మహాదేవ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పరకాల టౌన్ & మండల్, నడికూడ మండలాల పరిధిలోని గ్రామాలలో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులను హనుమకొండ జిల్లా కలెక్టర్తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి చేయూతనందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
  • జూలై 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త కార్డులు ఇవ్వకపోవా, పాత కార్డులను రద్దు చేశారన్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత అని, కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి పథకాలను మంజూరు చేస్తున్నామని అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్ కే నారాయణ, ఎసిపి సతీష్ బాబు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -