– ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు..
నవతెలంగాణ – జుక్కల్
ఎస్టీలను జాబితా నుంచి తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా జుక్కల మండలం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ జుక్కల్ మండల కమిటీ మరియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆదేశం ఆదేశాలనుసారం ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సంఘం సభ్యులు అన్నారు. ఎస్టిలో గిరిజనుల బంజారాలు 1976 కన్న ముందు 20 సంవత్సరాలుగా చాలా నష్టపోయామని తెలిపారు.
బంజారా సేవా సంఘం నాయకుడు స్వయం బాబురావు, వెంకట్రావు సుప్రీంకోర్టులో వేసిన కేసు వెంటనే ఉపసరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జుక్కల్ మండల గిరిజనులు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాదవ్ రాజు , ప్రధాన కార్యదర్శి వినోద్ , జుక్కల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ జాదవ్ నాందేవ్, ఉపాధ్యక్షులు రాజేందర్ రాథోడ్ , ఆడే ధనాజీ. హరి జాదవ్ సోపాన్ రాథోడ్ , ఎక్స్ ఆర్మీ ఆనంద్, యువత అధ్యక్షులు. ఉధవ్. బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES