బీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాలు..
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గం అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటర్ జాబితాను పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్ బిఆర్ఎస్ నాయకులకు శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జుక్కల్ మండల కేంద్రంలోనీ జుక్కల్ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ జాబిత, మార్పుల పరిశీలన చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీలు పటేల్, బొల్లి గంగాధర్, విట్టు పటేల్ , వాస్రే రమేష్ యువ నాయకులు భాను గౌడ్ , కౌలే రమేష్, జుక్కల్ జి పి జూనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు , గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ఓటరు జాబితాను పరిశీలించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES