సీపీఐ(ఎం) నేతలతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి భేటీ
నిరంకుశ, ఫాసిస్ట్ శక్తులపై పోరాటం : ఎం.ఎ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘నేను 52 ఏండ్లుగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నాను. రాజ్యాంగమే నా సందేశం. నా గురించి నేను చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు’ అని ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ ప్రతిని పట్టుకుని అన్నారు. ఢిల్లీలో ఆయన హరి కిషన్ సింగ్ సూర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆర్. అరుణ్ కుమార్‌లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఐ(ఎం) నేతలు తమ పార్టీ మద్దతును ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) నేతలు తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తానని అన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ భారతదేశం గొప్ప ఆలోచనను, రాజ్యాంగ విలువలను కాపాడటమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోరాట మని అన్నారు. నిరంకుశ, ఫాసిస్ట్ శక్తులపై పోరాటం రాజకీయ, సైద్ధాం తిక, సాంస్కృతిక ప్రతిఘటన అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్య, పార్లమెం టరీ విలువలు తుంగలో తొక్కబడుతు న్నాయని విమర్శించారు. ప్రతిపక్ష గొంతుక అయిన పుచ్చలపల్లి సుంద రయ్య, ఎకె గోపాలన్ లోక్‌సభలో మాట్లాడినప్పుడు నెహ్రూ, ఇతర నేతలు శ్రద్ధగా విన్నారని బేబీ గుర్తు చేశారు. వామపక్షాల మద్దతు ఉన్న యూపీఏ ప్రభుత్వానికి ”రూపకర్త”గా సూర్జీత్‌ను గుర్తు చేసుకున్నారు.
”అధికార, ఫాసిస్ట్ శక్తులకు” వ్యతిరేకంగా పోరాటంలో సూర్జీత్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. ”ఈ రోజు మన దేశం నిరంకుశ పాలనను ఎదుర్కొంటోంది. ఇది ఇటీవల నయా ఫాసిస్ట్ ధోరణులను తీసుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైన రాజకీయ, సైద్ధాం తిక, సాంస్కృతిక పోరాటమిది. ప్రతి పక్షమంతా మన దేశపుత్రులలో ఒకరిగా భావించడానికి కలిసి వస్తు న్నాం. జస్టిస్ రెడ్డి రచనలు, వార సత్వం అందరికీ తెలిసిందే” అని ఆయన అన్నారు. అనంతరం సీపీఐ ప్రధాన కార్యాలయం అజరు భవన్‌ను సందర్శించిన సుదర్శన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా నాయకులతో సమావేశమ య్యారు. ఈ సమావేశంలో సుదర్శన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఉన్నారు. ఆగస్టు 21న సుదర్శన్ రెడ్డి చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, డీఎంకే ఎంపీల మద్దతు కోరారు. ఆగస్టు 22న సుదర్శన్ రెడ్డి లక్నోకు వెళ్లి, అక్కడ ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఇతర ప్రతిపక్ష నాయకులను కలిసి మద్దతు కోరారు.
రాజ్యాంగమే నా సందేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES