- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
నవంబర్ 26వన ఢిల్లీలో జాతీయ మాల మాహ నాడు ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బిఆర్ బెంజిమెన్ పిలుపునిచ్చారు. బుధవారం జన్నారంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిర్వహించే ఈ సభకు దళిత నాయకులు తరలి రావాలని కోరారు. కార్యక్రమాల్లో మాల మహానాడు నాయకులు బండ దేవేందర్, అక్క వత్తుల దేవయ్య, పిట్ట రాజారావు ఆల్తట్ నరసయ్య, శాంతయ్య, కండ్ల తిరుపతి, దుర్గం అమృత రావు, కూర్మ శంకర్ కుంభాల రాజన్న, తీగల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



