Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్హన్మాపురం గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి..

హన్మాపురం గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి..

- Advertisement -

వడపర్తి నుండి చీకటి మామిడి వరకు రెండు వరుసల(డబుల్) రోడ్డును వెంటనే పూర్తి చేయాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

హన్మాపురం గ్రామంలో 2023లో శంకుస్థాపన చేసి 70 శాతం నిర్మాణం పూర్తి చేసిన గ్రామపంచాయతీ భవనానికి మరిన్ని నిధులు కేటాయించి పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడపర్తి మెయిన్ రోడ్డు నుండి చీకటిమామిడి గ్రామం వరకు రెండు వరుసల రోడ్డును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు. 

 ఆదివారం సీపీఐ(ఎం) పోరు బాటలో భాగంగా భువనగిరి మండలం హన్మాపురం, వడపర్తి గ్రామాలలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కలిసి సమస్యలను అధ్యయనం చేసి మాట్లాడారు. హన్మాపురం గ్రామంలో అసంపూర్తిగా నిర్మాణం జరిగిన గ్రామపంచాయతీ భవనాన్ని  పూర్తి చేయాలని ” నిరసన ” కార్యక్రమం, వడపర్తి మెయిన్ రోడ్డు నుండి నుండి చీకటిమామిడి వరకు రెండు వరుసల (డబల్ రోడ్డు) రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని ” రాస్తారోకో ” కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గత బి‌ఆర్.ఎస్ ప్రభుత్వం ఎస్.డి.ఎఫ్ నిధుల కింద రూ.20 లక్షల గ్రామపంచాయతీ నిర్మాణానికి మంజూరు చేయగా 70 శాతం భవనం పూర్తయిందని అన్నారు. మిగతా పనులు కావాలంటే ఇంకా ఐదు నుండి రూ.10 లక్షల అవసరం ఉన్నాయని అన్నారు. 

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్డింగ్ నిర్మాణ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ ప్రదేశములో పిచ్చి మొక్కలతో చెత్తాచెదారంతో భవనము కూడా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉందని అన్నారు. కనీసం గ్రామ పంచాయతీ కార్యదర్శి నూతన గ్రామపంచాయతీ నిర్మాణ ప్రదేశంలో పేరుకుపోయిన చెత్తను, కంప చెట్లను తొలగించే పరిస్థితుల్లో లేరని అన్నారు. స్థానిక శాసనసభ్యులకు గ్రామ ప్రజలు అనేకమార్లు దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామపంచాయతీ భవనాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నర్సింహ సూచించారు.

సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్యలు మాట్లాడుతూ.. భువనగిరి జిల్లా కేంద్రం నుంచి బొమ్మలరామారం వరకు ప్రధాన రోడ్డుగా ఉన్న వడపర్తి మెయిన్ రోడ్డు నుండి చీకటిమామిడి వరకు రెండు వరుసల (డబల్ రోడ్డు) కోసం ఉన్న రోడ్డును తోవ్వి నాలుగు నెలలు గడుస్తున్న పనులు మాత్రమే జరగడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. మట్టి, కంకర పోయడం వల్ల ప్రయాణికులు ఆ రోడ్డు వెంబడి ప్రయాణించడం వల్ల అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, వడపర్తి గ్రామంలో దుమ్ము, దూళితో, కంకర తేలి ప్రజలకు దెబ్బలు తాకి గాయపడుతున్నారని అన్నారు. నెల రోజులలో రోడ్డును పూర్తి చేస్తామన్న కాంట్రాక్టర్, అధికారులు నాలుగు నెలలైనా పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు.

ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికుల, ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య , హన్మాపురం సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య , వడపర్తి శాఖ కార్యదర్శి పాండాల అంజయ్య తోపాటు రెండు గ్రామాలకు సంబంధించిన సీపీఐ(ఎం) సభ్యులు, ప్రజలు బండి శ్రీను, దయ్యాల మల్లేష్, రాగాల రాజేశ్వర్, తోటకూరి నాగరాజు, కుసుమ మదు, పాండాల బాలరాజు, ముడుగుల రాజు, గంగనబోయిన రాజు, ఎర్రబోయిన మల్లేష్ రాపాక రమేష్ , గోరంతల ఉమేష్ , కొండ మనోజ్, తాటికొండ పోషమల్లు, నర్సింహ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad