Monday, July 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫిజిక్స్‌ వాలాతోఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి

ఫిజిక్స్‌ వాలాతోఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత కోచింగ్‌ ఇవ్వాలి :ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా జేఈఈ, నీట్‌, క్లాట్‌ కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించటం హర్షించదగ్గ విషయమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ కోచింగ్‌ను కార్పొరేట్‌ ఎడ్యు టెక్‌ సంస్థ ” ఫిజిక్స్‌ వాలా”తో తెలంగాణ అచీవర్స్‌ 2025 కోసం చేసిన ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కోచింగ్‌ను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న ”ఫిజిక్స్‌ వాలా” వంటి సంస్థలతో కాకుండా ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కోచింగ్‌ను ఇవ్వాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -