Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుతూ మంత్రంగానే తుడుపుకపోయిన కాంట్రాక్టర్

తుతూ మంత్రంగానే తుడుపుకపోయిన కాంట్రాక్టర్

- Advertisement -

శ్రీపాద చిల్డ్రన్ పార్క్ లో నాసిరకం పనులు…
చిన్నపిల్లల చిల్డ్రన్ పార్క్ లో కకృతి పడ్డ కాంట్రాక్టర్… 
నవతెలంగాణ – కాటారం 

కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి గ్రామ శివారులో గల గ్రామ పంచాయతీ దగ్గర్లో ఏర్పాటు చేసిన శ్రీపాద చిల్డ్రన్ పార్కు నిర్వహణ లోపంతో పిల్లలకు సౌకర్యంగా లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రూ.36 లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ లో ఉయ్యాలలు ఏర్పాటు చేసి అదే రోజున తీసుకెళ్లారు. అలాగే పిల్లలు ఆడుకునే పరికరాలకు కూడా నట్టు, బోట్లు విరిగిపోవడంతో కాంట్రాక్టుటర్ తుతూ మంత్రంగా పనులు చేసి తుడుసుకొని పోయి కక్రుతి పడ్డాడాని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నాసిరకం ఆట వస్తువులపై పర్యవేక్షణ జరిపించి, కక్రుత్తి పడ్డ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని శ్రీపాద చిల్డ్రన్ పార్కు నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

సి ఎస్ ఆర్ నిధుల ద్వారా రూ.36 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కులో పూర్తిస్థాయిలో పరికరాలు లేకపోవడం చూస్తా ఉంటే బయట జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పార్కుకు 36 లక్షల అవుతుందా? అని బయట చర్చించుకుంటున్నారు. ఈ కనపడకుండా పోయిన మూడు ఉయ్యాలల తీరే, రూ.36 లక్షల కూడా ఈ విధంగానే మాయం చేయవచ్చు అని అనుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -