ఛేదనలో అజేయ అర్థ సెంచరీ
టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపు
గుజరాత్ టైటాన్స్ 162/6
పంజాబ్ కింగ్స్ 165/7
పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొంది సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. అరంగ్రేట ఆటగాడు కూపర్ కానొలి (72 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో ఛేదనలో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (18), మార్కస్ స్టోయినిస్ (0) నిష్క్రమణతో పంజాబ్ కింగ్స్‌పై ఒత్తిడి పడినా.. కూపర్ అలవోకగా లాంఛనం ముగించాడు. శుభ్‌మన్ గిల్ (39), జోశ్ బట్లర్ (38) రాణించటంతో గుజరాత్ టైటాన్స్ తొలుత 162 పరుగులు చేసింది.
నవతెలంగాణ-ముల్లాన్‌పూర్
ఐపీఎల్ గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈసారి టైటిల్ వేటను విజయంతో మొదలెట్టింది. మంగళవారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల ఛేదనలో కూపర్ కానొలి (72 నాటౌట్, 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగ్రేట ఇన్నింగ్స్‌లోనే కండ్లుచెదిరే ఇన్నింగ్స్ ఆడిన కూపర్.. పంజాబ్ కింగ్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18, 11 బంతుల్లో 2 సిక్స్‌లు), ప్రియాన్షు ఆర్య (7, 8 బంతుల్లో 1 సిక్స్), నెహల్ వదేరా (3), శశాంక్ సింగ్ (4), మార్కస్ స్టోయినిస్ (0) నిరాశపరిచారు. టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ (3/29) మూడు వికెట్లతో పంజాబ్ కింగ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ ఓ ఎండ్‌లో నిలబడిన కూపర్ అజేయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 5 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిన కూపర్..34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ వికెట్లతో టైటాన్స్ రేసులోకి వచ్చినా.. క్రమం తప్పకుండా బౌండరీలు బాదాడు. మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్‌కు మెరుపు విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (37, 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్) పవర్‌ప్లేలో తనదైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఆఖర్లో మార్కో యాన్సెన్ (9, 10 బంతుల్లో 1 సిక్స్), జేవియర్ బార్ట్‌లెట్ (11 నాటౌట్, 5 బంతుల్లో 1 సిక్స్) మెప్పించారు. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే ఛేదించింది.
రాణించిన బట్లర్, గిల్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆశించిన ప్రదర్శన చేయలేదు. సాయి సుదర్శన్ (13, 11 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశపరిచాడు. శుభ్‌మన్ గిల్ (39, 27 బంతుల్లో 6 ఫోర్లు), జోశ్ బట్లర్ (38, 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు. గ్లెన్ ఫిలిప్స్ (25, 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సైతం ఆకట్టుకున్నాడు. కానీ ఈ ముగ్గురు డగౌట్‌కు చేరుకున్న తర్వాత.. టైటాన్స్ స్కోరు వేగం మందగించింది. వాషింగ్టన్ సుందర్ (18, 16 బంతుల్లో 2 ఫోర్లు) అంచనాలను అందుకోలేదు. షారుక్ ఖాన్ (4) తేలిపోయాడు. రాహుల్ తెవాటియ (11 నాటౌట్), రషీద్ ఖాన్ (0 నాటౌట్) దూకుడుగా ఆడలేకపోయారు. 20 ఓవర్లలో 6 వికెట్లకు గుజరాత్ టైటాన్స్ 162 పరుగులే చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజరు కుమార్ వైశాక్ (3/34), యుజ్వెంద్ర చాహల్ (2/28), మార్కో యాన్సెన్ (1/20) రాణించారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
గుజరాత్ టైటాన్స్ : 162/6 (శుభ్‌మన్ గిల్ 39, జోశ్ బట్లర్ 38, విజరుకుమార్ వైశాక్ 3/34, యుజ్వెంద్ర చాహల్ 2/28)
పంజాబ్ కింగ్స్ : 165/7 (కూపర్ కానొలి 72, ప్రభుసిమ్రన్ సింగ్ 37, ప్రసిద్ కృష్ణ 3/29, రషీద్ ఖాన్ 1/29)
కూపర్ షో
- Advertisement -
- Advertisement -



