– మహ్మదాబాద్ సర్పంచ్ సూర్నార్ శకుంతలబాలు
నవతెలంగాణ – జుక్కల్
గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరం ఉంటుందని గ్రామ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు గ్రామంలోని జిపి కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామసభలో మాట్లాడుతూ జిపి వర్గం సభ్యులు మరియు ఉప సర్పంచ్ అందరూ కలిసి గ్రామస్తుల సహకారం తీసుకొని గ్రామంలోని సమస్యలను పరిష్కరించు కొనే విధంగా గ్రామాభివృద్ధిలో తోడ్పాటున అందించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. నేడు నిర్వహించిన గ్రామసభలు పలు విషయాలు చర్చించిన అంశాలు గ్రామ ప్రజలకు జిపి కార్యదర్శి జీవన్ రాథోడ్ వివరించడం జరిగింది.
1. వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యల గురించి
2. వి డబ్ల్యూ ఎస్ సి (VWSC) కమిటీ.
3. నర్సరీ నిర్వహణ.
4. పరిశుద్ధ నిర్వహణ.
5. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.
6. ప్రత్యేక అధికారి కాలంలో చేసిన ఖర్చుల గురించి చర్చించనైనది.
7. ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న పనుల వివరాలు
8. గ్రామపంచాయతీ నిధుల నుండి చేసిన వర్క్ ల గురించి మరియు చేయబోయే వర్క్ ల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు, ఉప సర్పంచ్ పోతుల లక్ష్మణ్, జిపి పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు,యువకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



