ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.జి.రామేశ్వర్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.జి.రామేశ్వర్ రావు శనివారం కార్మిక అండ్ ఉపాధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇఎస్‌సీఐ)లో తాజాగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) బ్యాటరీ సస్టైనబిలిటీ ఇంజినీరింగ్ కోర్సు గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించారని, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సుస్థిరశక్తి రంగాల్లో పెరుగుతున్న నైపుణ్యాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సును స్టాఫ్‌లే రూపకల్పన చేశారని తెలిపారు. ఇందులో (ఈవీ) బ్యాటరీ సాంకేతికత, సస్టైనబిలిటీ పద్ధతులు, బ్యాటరీ జీవన చక్ర నిర్వహణ, రీసైక్లింగ్ విధానాలు, భద్రతా ప్రమాణాలు మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాయోగిక శిక్షణతోపాటు ఇంటర్న్‌షిప్ అంశాలు పొందుపరచబడ్డాయని అన్నారు.
ఈ సందర్భంగా డా. జి.రామేశ్వర్‌రావు మాట్లాడుతూ.. దేశం గ్రీన్ మొబిలిటీ దిశగా సాగుతున్న నేపథ్యంలో నైపుణ్యంతో కూడిన ఇంజినీర్లను తయారు చేయడం అత్యంత అవసరమని వివరించారు. ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిం చడంలో మరియు సుస్థిర అభివృద్ధికి తోడ్పడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ భవిష్యత్ పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువతకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.
దేశం గ్రీన్ మొబిలిటీ దిశగా సాగుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



