Sunday, January 25, 2026
E-PAPER
Homeకరీంనగర్ఓటుతోనే దేశ తలరాత మారుతుంది: సర్పంచ్

ఓటుతోనే దేశ తలరాత మారుతుంది: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి 
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్యుడి చేతిలో ఉన్న గొప్ప ఆయుధమని, దాని ద్వారా మన దేశ భవిష్యత్తును, మన తలరాతను మనమే మార్చుకోవచ్చని వీర్నపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న-అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటర్ల ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు బాధ్యతగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓటును అమ్ముకోవడం నేరమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే దేశంలో మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ జక్కుల నరేష్, ఏ ఎం సి వైస్ చైర్మన్ లక్ష్మణ్,వార్డు సభ్యులు భగవంతం,సంజీవ్ ,గోరె మీయా,నవీన్, బి అర్ ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు గుగులోతు కళా,గ్రామపెద్దలు గడ్డం దేవయ్య, లింబాద్రి,ఎల్లం, తిరుపతి, దేవయ్య శేఖర్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -