Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ(ఎం) గెలుపే సమాధానం అవ్వాలి

సీపీఐ(ఎం) గెలుపే సమాధానం అవ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ 
రేమద్దులలో సీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతుగా సభ
నవతెలంగాణ – వనపర్తి  

ప్రజా ఉద్యమాలకు ప్రాణమిస్తూ, సమస్యలకు సమాధానాలు చూపుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే సీపీఐ(ఎం) గెలుపే ప్రత్యర్థి పార్టీలకు సమాధానం అవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. పానగల్ మండలం రేమోద్దుల గ్రామంలో సర్పంచి స్థానానికి సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కామ్రేడ్ రేగిచెట్టు నిరంజన్ ను, 12 వార్డుల అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు.

గత నలభై ఏళ్లుగా సీపీఐ(ఎం) యువజన ఉద్యమాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామంలోని పెత్తందారులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పోరాడిందన్నారు. పాలేరులకు ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఆనాటి నాయకులు ఎంతగానో కృషి చేశారని, నాడు పాలేరు పని నుంచి బయటికి వచ్చి నేడు మిలియనీర్లు ఇంజనీర్లు అయ్యారని ఈ సందర్భంగా గత ఉద్యమాలను గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమాలను ఊటంకిస్తూ జరిగిన పోరాటాలు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడమే కాదు భవిష్యత్తులోనూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులై బాధ్యతల్లోకి రావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) గుర్తించిందని తెలిపారు.

అందులో భాగంగానే నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) విస్తృతంగా ప్రజాబలం ఉన్నచోట ఎన్నికలకు వెళ్లిందని తెలిపారు. ప్రజల నుంచి ఆదరణ పెరగడమే కాకుండా ప్రజా ఉద్యమ నాయకులకు అండగా నిలుస్తూ ఇప్పటికే పదుల సంఖ్యలో సర్పంచి స్థానాలను నాయకులకు అప్పగించారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ ప్రజా ఉద్యమాలకు పునాది వేసిన రేమద్దులలోనూ పలుచోట్ల సీపీఐ(ఎం) అభ్యర్థులు కాంగ్రెస్ విఆర్ఎస్ ఇతర పార్టీల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని వారందరికీ గెలుపునకు ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. గతంలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) అభ్యర్థులు విజయాలు సాధించి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తు చేశారు.

మరో మారు సీపీఐ(ఎం) అభ్యర్థి కామ్రేడ్ రేగు చెట్టు నిరంజన్ కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అతని అభ్యర్థిత్వాన్ని తమ ఓటు ద్వారా విజయాన్నందించి, భారీ మెజార్టీతో అభివృద్ధికి బాటలు వేయాలని ఈ సందర్భంగా జాన్ వెస్లీ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కామ్రేడ్ రేగిచెట్టు నిరంజన్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, గుంటి వెంకటయ్య, భగత్, ఖాజా, చంద్రశేఖర్, భాస్కర్, కే వెంకటయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -