జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు.. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా గత వంద సంవత్సరాల నుండి సీపీఐ ప్రయాణిస్తుందని అని జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం 18వ మహాసభ చిన్నకందుకూర్ గ్రామంలో నిర్వహించారు.ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా సీపీఐ మండల సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్ మహిళా సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి ఆరే పుష్ప వ్యవహరించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ.. ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల ఏజెండాగా నిత్యం ప్రజల మధ్య నిలబడి పోరాడే పార్టీ సీపీఐ అని శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని దున్నేవారికి భూమి కావాలని శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ సిపిఐ అని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడిడుదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటిని అదుపు చేయకుండా పేదవారి నడ్డి విరిచే విధంగా ఉన్నాయని, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ ను వెంటనే ఆపాలని ఈపేరుతో చంపడం సరైనది కాదానీ మావోయిస్టులను చర్చలు ఆహ్వానించి సానుకూలంగా పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ, సీపీఐ జిల్లా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి రాజయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బబ్బూరి శ్రీధర్, సీపీఐ మండల కార్యదర్శి కల్లెపెల్లి మహేందర్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ మెంబర్ పేరబొయిన పెంటయ్య, ప్రజానాట్యమండలి గాయకురాలు హింజ హేమలత, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు మునుకుంట్ల నరసమ్మ, ఆరే పుష్ప, రైతు సంఘం మండల కార్యదర్శి పేరబోయిన బంగారు, రాగిరి బాలకిషన్, డిహెచ్పిఎస్ మండల అధ్యక్షురాలు మద్దూరు భాగ్యమ్మ, చిన్నకందుకూరు గ్రామ శాఖ కార్యదర్శి కాటం శ్రీకాంత్, సుబ్బురు నరసయ్య, రాకల స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాలే ఊపిరిగా సీపీఐ ప్రయాణం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES