Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

- Advertisement -

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి 
నవతెలంగాణ – పెద్దవంగర

సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆ సంఘం మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరించి, సభ్యత్వ నమోదు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 వ తేదీని పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన పీఆర్టీయూ మహాధర్నా కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు పీఆర్టీయూ పోరాటం సాగిస్తున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఈ మద్యనే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. మహాధర్నా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సీఎల్ రోజ్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నందున జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరై మహాధర్నా ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీ. సురేష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు యాకూబ్ పాషా, శ్రీధర్, బాలరాజ్, వేణుమాధవ్, విద్యాసాగర్ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad