Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుసీపీఎస్ విధానం రద్దు చేయాలి: పీఆర్టీయూ

సీపీఎస్ విధానం రద్దు చేయాలి: పీఆర్టీయూ

- Advertisement -

పిఆర్టియూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి..
నవతెలంగాణ – తిమ్మాజిపేట

సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని నాగర్ కర్నూల్ జిల్లా పిఆర్టియూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి అన్నారు. శనివారం పిఆర్టియూ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయ అడ్మినిస్ట్రేట్ అధికారి చంద్రశేఖర్ కు శనివారం సాయంత్రం వినతి పత్రం అందజేశారు. అనంతరం సాయి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీపీఎస్ విధానం రద్దు చేసే అవకాశం వచ్చిన అప్పటి ప్రభుత్వం 2014 ఆగస్టు 23న జీవో నెంబర్ 28 ద్వారా సీపీఎస్ విధానంలో కొనసాగుతామని చెప్పడం బాధాకరమన్నారు.

ఆగస్టు 23 సీపీఎస్ ఉద్యోగులకు చీకటి దినంగా పరిగణిస్తున్నామని అన్నారు. జీవో నెంబర్ 28ని వెంటనే రద్దు చేయాలని నూతన రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనకు ఉన్న అవకాశాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకపోవడంతో సిపిఎస్ రద్దు అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము జీవో 28 ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓపి ఎస్ అమలు చేయాలని నేటి శనివారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారని ఆయన తెలిపారు. అనంతరం జిల్లాలోని మండల కేంద్రాలలో తహసీల్దార్లుకు అదేవిధంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ అధికారికి సిపిఎస్ రద్దు చేయాలని వినతి పత్రాలు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు జిల్లా పిఆర్టియూ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad