Wednesday, January 14, 2026
E-PAPER
Homeసినిమాఈ సక్సెస్‌ క్రెడిట్‌ మెగాస్టార్‌దే..

ఈ సక్సెస్‌ క్రెడిట్‌ మెగాస్టార్‌దే..

- Advertisement -

అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కలయికలో విడుదలైన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. వెంకటేష్‌ కీలక పాత్రలో నటించారు. షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథనాయిక నటించారు. అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్‌ చేశారు. ప్రీమియర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకొని రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌తో హౌస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ మెగా బ్లాక్‌ బస్టర్‌ థ్యాంక్యూ మీట్‌ నిర్వహించారు.
డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ‘ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్‌గా చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. నా కెరీర్‌లో చాలా ఫాస్ట్‌గా ఫినిష్‌ చేసిన స్క్రిప్ట్‌ ఇది. 25 రోజుల్లో స్క్రిప్ట్‌ పూర్తి చేశాను. దానికి కారణం చిరంజీవి. ఇందులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్‌ ఆయనే. అందుకే ఈ క్రెడిట్‌ మొత్తం ఆయనకే ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయన హదయపూర్వక కతజ్ఞతలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు, చిరంజీవిని అభిమానించే ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. చిరంజీవి ఈ సినిమాలో అడుగడుగునా ఒక మ్యాజిక్‌ని క్రియేట్‌ చేసే అవకాశం నాకు కల్పించారు. ఈ సినిమాకి నిర్మాతలుగా చేసిన సాహు నా ఫ్రెండ్‌. తను ఫెయిల్యూర్‌ వచ్చిన, సక్సెస్‌ వచ్చిన ఒకేలా ఉంటాడు. ఇంత పెద్ద బడ్జెట్‌ని ఇంత స్టార్‌ కాస్ట్‌ ఇచ్చి సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్‌ సుస్మిత. నేను ప్రతి సినిమా సక్సెస్‌కి జోన్‌ అవుట్‌లో ఉంటా. ఇంతపెద్ద సక్సెస్‌ కొట్టానా అనే జోన్‌ అవుట్‌లో ఉంటా. సుస్మిత కూడా అలాంటి జోన్‌ అవుట్‌లో కనిపించారు. చిరంజీవి అద్భుతమైన ప్రాజెక్టులో తన పేరు ఉండాలని కలలు కన్న సుస్మితకి ఆ డ్రీమ్‌ నెరవేరినందుకు కంగ్రాజులేషన్స్‌. సంక్రాంతికి వసూళ్లపరంగా ఇద్దరు నిర్మాతలు హ్యాపీగా ఫీల్‌ అవ్వాలి. ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అందరూ హ్యాపీగా ఫీల్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘మెగాస్టార్‌తో సినిమా చేస్తున్నాం అన్నప్పుడు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అది ఎవరికైనా ఒక బిగ్‌ డ్రీమ్‌. మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ బాస్‌ ఆఫీస్‌ అవుతుందని రెండు నెలల క్రితమే అనిల్‌తో నేను చెప్పాను. తను టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నారు. ఆడియన్స్‌ ఈ సినిమాని అద్భుతంగా ఎంజారు చేస్తున్నారు. సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవికి, మేము అడగగానే ఒక కేమియో చేసిన వెంకటేష్‌కి, నయనతారకి ధన్యవాదాలు. మా డైరెక్టర్‌ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అందుకే ఆయన మన అందరిని నవ్విస్తున్నారు. నెక్స్ట్‌ వీక్‌ నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్‌ ఎగ్జిబిటర్స్‌ సెలబ్రేట్‌ చేసుకుంటారు’ అని ప్రొడ్యూసర్‌ సాహు గారపాటి చెప్పారు.
ప్రొడ్యూసర్‌ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ,’ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కలెక్షన్స్‌ టాక్‌ రెస్పాన్స్‌ అద్భుతంగా వుంది. సినిమా లాంచింగ్‌ సమయంలో నాన్న నా పేరు అడిగితే సుస్మిత కొణిదెల అని చెప్పాను. ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. ఆ పేరు నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. నాకు, సాహుకి అనిల్‌ సంక్రాంతికి బిగ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -