Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులకు చేస్తున్న మేలు ఓర్వలేకనే విమర్శలు

రైతులకు చేస్తున్న మేలు ఓర్వలేకనే విమర్శలు

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ కపట ప్రేమ : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతులకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న మేలును చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే రూ.2 లక్షల లోపు ఉన్న పంట రుణమాఫీని చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నమని గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీని ఒకేసారి చేయలేకపోయిందనీ, దాంతో రైతులకు రుణమాఫీ కాకపోగా రూ.2630 కోట్ల వడ్డీ భారం పడిందని ఎత్తిచూపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా రుణమాఫీపై రైతులను మోసం చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడటం చూస్తుంటే అది కపట ప్రేమకు పరాకాష్టగా కనిపిస్తోందని విమర్శించారు. రైతులు ఈ విషయాలన్నింటి బాగా గమనిస్తున్నారని, వాస్తవాస్తవాలు వారికి తెలుసని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమనీ, భవిష్యత్తులో కూడా రైతులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -